surajpal amu: దీపిక, భన్సాలీల తలలు తెస్తే 10 కోట్లు ఇస్తానన్న నేత.. బీజేపీకి రాజీనామా

  • బీజేపీకి రాజీనామా చేసిన సూరజ్ పాల్ అమూ
  • హర్యాణా సీఎంపై విమర్శలు
  • కార్యకర్తలకు కనీస గౌరవం కూడా ఇవ్వరని మండిపాటు

'పద్మావతి' సినిమాపై హర్యాణా బీజేపీ నేత, మీడియా చీఫ్ కోర్డినేటర్ సూరజ్ పాల్ అమూ మండిపడ్డ సంగతి తెలిసిందే. అంతేకాదు నటి దీపికా పదుకునే, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీల తలలు తెస్తే రూ. 10 కోట్లు ఇస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ హైకమాండ్ కన్నెర్రజేసింది. షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ కోరింది.

ఈ నేపథ్యంలో బీజేపీకి సూరజ్ పాల్ రాజీనామా చేశారు. బీజేపీ అధిష్ఠానం, హర్యాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీరుతో ఆయన అసంతృప్తికి గురయ్యారని చెబుతున్నారు. మరోవైపు ఖట్టర్ పై సూరజ్ పాల్ విమర్శలు గుప్పించారు. ఖట్టర్ లాంటి వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదని... కార్యకర్తలకు ఆయన కనీస గౌరవం కూడా ఇవ్వరని మండిపడ్డారు.

surajpal amu
bjp
padmavathi
manoharlal khatter
  • Loading...

More Telugu News