giddi eswari: జగన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతా: గిడ్డి ఈశ్వరి

  • నాపై తప్పుడు వార్తలు రాస్తున్నారు
  • సీఎం పదవి కోసమే జగన్ పార్టీ పెట్టారు
  • మేము ఉన్నత స్థానాలకు వెళ్లకూడదా?

వైసీపీ అధినేత జగన్ పై ఆ పార్టీని వీడి టీడీపీలో చేరిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నిప్పులు చెరిగారు. పార్టీ కోసం మూడున్నర ఏళ్లపాటు తాను పడ్డ కష్టం మీకు కనిపించలేదా? అంటూ జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. చివరకు తనకు మానసిక క్షోభను మాత్రమే మిగిల్చారని అన్నారు. పాతిక కోట్లు తీసుకుని పార్టీ మారినట్టు తనపై వారి పేపర్లో తప్పుడు కథనాలను ప్రచురించారని మండిపడ్డారు.

ఇప్పుడు ఏదో వీడియో చూపెడుతున్నారని... రేపు మరేం చేస్తారో అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమరు చేసిన పనితో తాను ఎంతో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వాన్ని హత్య చేసే విధంగా ప్రవర్తించినందుకు జగన్ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని తెలిపారు. కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే కదా మీరు పార్టీ పెట్టింది? అంటూ జగన్ ను ఈశ్వరి ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఇంకా చాలా రోజులు ఉన్నప్పటికీ... 'నేనే సీఎం.. నేనే సీఎం' అని జగన్ చెప్పుకోవడం లేదా? అని అన్నారు. ఆయన చెప్పుకుంటే గొప్ప విషయాలా? మేము మాత్రం ఉన్నత స్ధానాలకు వెళ్లరాదా?' అంటూ ధ్వజమెత్తారు. 

giddi eswari
Jagan
YSRCP
Telugudesam
Eswari fires on jagan
  • Loading...

More Telugu News