narayana college: నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలకు భారీ జరిమానా విధించాం: మంత్రి గంటా

  • రూ. 50 లక్షల చొప్పున జరిమానా విధించాం
  • యాజమాన్యాలతో సీఎం చర్చించారు
  • విద్యార్థుల ఆత్మహత్యలను తగ్గిస్తాం

నిబంధనలు పాటించని నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలకు రూ. 50 లక్షల చొప్పున భారీ జరిమానా విధించామని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విద్యా సంస్థల్లో విద్యార్థులపై ఒత్తిడి ఉన్నమాట వాస్తవమేనని చెప్పారు. ప్రైవేటు కాలేజీల్లో ఆత్మహత్యల నివారణకు రెండు కమిటీలు వేశామని చెప్పారు.

చదువుకోవాలంటూ రోజుకు 18 గంటలపాటు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. విద్యా సంస్థల యాజమాన్యాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా చర్చించారని చెప్పారు. విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి ఉండరాదంటూ హెచ్చరించారని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలు ఒక్క ఏపీలోనే జరగడం లేదని... దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయని... ఆత్మహత్యలను కచ్చితంగా అరికడతామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి అన్ని కళాశాలల్లో పూర్తి స్థాయిలో నిబంధనలను అమలు చేస్తామని తెలిపారు. 

narayana college
sri chaitanya college
ganta srinivasa rao
Chandrababu
  • Loading...

More Telugu News