bhuma akhilapriya: అసెంబ్లీలో అఖిలప్రియకు చురకలంటించిన ఎమ్మెల్యే గౌతు శివాజీ!

  • ఏపీ అసెంబ్లీలో తెలుగు భాషపై చర్చ
  • అన్ని శాఖలు తెలుగుకు ప్రాధాన్యతను ఇవ్వాలన్న అఖిలప్రియ
  • మంత్రి ఇంగ్లీషు పదాలు వాడుతున్నారంటూ శివాజీ చురక

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు తెలుగు భాషపై చర్చ జరగింది. ఈ సందర్భంగా సభలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ, ఇకపై అన్ని శాఖలు తెలుగుకు ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు. అయితే, ఈ సందర్భంగా ఆమె అనేక ఇంగ్లీష్ పదాలు వాడారు. దీంతో, ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందర్ శివాజీ కల్పించుకుని అఖిలప్రియకు చురకలంటించారు. తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్న మంత్రి... పలు ఇంగ్లీష్ పదాలను వాడుతున్నారని అన్నారు. మంత్రులంతా ఇకపై అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఆంగ్ల పదాలు వాడకుండా, తెలుగులోనే మాట్లాడితే బాగుంటుందని సూచించారు.

bhuma akhilapriya
GOUTHU SYAM SUNDER SIVAJI
ap assembly sessions
  • Loading...

More Telugu News