anantapuram: జేసీతో రాజీపడనందుకు హత్యాయత్నం: వైకాపా కార్యకర్త హరిప్రియ ఆరోపణ

  • తనపై హత్యాయత్నం చేశారన్న హరిప్రియ
  • హరిప్రియ అన్నను చంపిన కేసులో జేసీ వర్గీయులు నిందితులు
  • కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి

తన అన్నను చంపిన కేసులో జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులతో రాజీ పడని కారణంగా తనపై హత్యాయత్నం చేశారని వైకాపా కార్యకర్త, అనంతపురం జిల్లా అప్పేచర్ల అంగన్ వాడీ కార్యకర్త హరిప్రియ ఆరోపించారు. తన అన్న, వైఎస్ఆర్ సీపీ నేత విజయ భాస్కర్ రెడ్డిని జేసీ వర్గీయులు హత్య చేశారని, కేసు విచారణ దశలో ప్రస్తుతం ఉందని చెప్పిన హరిప్రియ, కేసులో తాను రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.

తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారని, విననందుకు తనను హత్య చేయాలని చూశారని ఆరోపించారు. గత పది రోజులుగా నిత్యమూ దాడికి యత్నిస్తున్నారని, తనకు ఏదైనా జరిగితే ఆ బాధ్యత జేసీ దివాకర్, టీడీపీ ప్రభుత్వానిదేనని హెచ్చరించారు. విషయం పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

anantapuram
Haripriya
Jc diwakar reddy
  • Loading...

More Telugu News