Ivanka trump: ఇవాంకా ట్రంప్ సెక్యూరిటీ లీక్... అవాక్కైన యూఎస్ ఇంటెలిజెన్స్!

  • కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇవాంకా పర్యటన
  • తొలి రోజు సెక్యూరిటీ వివరాలు బయటకు
  • వైరల్ అయిన ప్రముఖుల భద్రతా సీసీటీవీ ఫుటేజ్ 
  • విచారణ ప్రారంభించిన పోలీసు అధికారులు

కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇవాంకా ట్రంప్ పర్యటన సాగుతుండగా, తొలి రోజు చివరి నిమిషంలో ఆమె సెక్యూరిటీ వివరాలు లీక్ కావడంతో యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు మరింత అప్రమత్తమయ్యాయి. విషయాన్ని తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులకు తెలపడంతో, ఇదెలా జరిగిందన్న విషయమై విచారణ మొదలైంది. ఇంతకీ ఏం జరిగిందంటే, నిన్న రాత్రి ప్రధాని మోదీ ఫలక్‌ నూమా ప్యాలెస్ లో ఇవాంకా, ఇతర వీఐపీలకు ఆత్మీయ విందు ఇచ్చిన సంగతి తెలిసిందే.

 అయితే 101వ టేబుల్‌ లో ఎవరు కూర్చున్నారు... ప్యాలెస్ లో ఇతర ప్రముఖులు, వారి భద్రతకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ లు విందు మధ్యలో బయటకు రాగా, పలు టీవీ చానల్స్ వీటిని ప్రసారం చేశాయి. విషయం తెలుసుకున్న అధికారులు అవాక్కై, అత్యంత రహస్యంగా ఉన్న భద్రతాంశాల వీడియోలను వెంటనే నిలిపివేసినప్పటికీ, ఇవి ఎలా బయటకు వచ్చాయన్న విషయమై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

Ivanka trump
Hyderabad
USIS
  • Loading...

More Telugu News