Ivanka Trump: ఇవాంకా రాకను వ్యతిరేకిస్తూ ఆందోళన.. ఉద్రిక్తత!

  • టీపీఎఫ్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ప్రదర్శన
  • అడ్డుకున్న పోలీసులు.. వాగ్వాదం
  • విదేశీ పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు తొత్తులన్న ఆందోళనకారులు

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరైన వైట్‌హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్‌కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఇవాంకా రాకను నిరసిస్తూ టీపీఎఫ్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ సదస్సు పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

జీఈఎస్‌తో పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లో మన ప్రభుత్వాలు కీలుబొమ్మలుగా మారాయని విమర్శించారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా, ఇవాంకా వ్యతిరేక ఆందోళన గురించి ముందే సమాచారం అందడంతో కొందరు టీపీఎఫ్ నేతలను పోలీసులు ముందుగానే అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Ivanka Trump
White House
America
Hyderabad
  • Loading...

More Telugu News