susan sarandon: ట్రంప్ కంటే హిల్లరీనే డేంజరస్.. ఆమె గెలిచి ఉంటే ఈ పాటికి యుద్ధం వచ్చుండేది!: హాలీవుడ్ నటి

  • హిల్లరీ ప్రమాదకరమైన వ్యక్తి
  • వలసదారులను వెనక్కి పంపడంలో తప్పు లేదు
  • ఒబామా హయాంలో కూడా ఇది జరిగింది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే ఆయనతో పోటీ పడ్డ హిల్లరీ క్లింటన్ చాలా డేంజరస్ అని ప్రముఖ హాలీవుడ్ నటి సుసాన్ సరాండన్ అన్నారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ గెలిచి ఉంటే అమెరికా పరిస్థితి ఇప్పటికే దారుణంగా ఉండేదని.... యుద్ధ వాతావరణంలో చిక్కుకుని ఉండేదని అన్నారు.

హిల్లరీ ప్రమాదకరమైన వ్యక్తి అనేది తన అభిప్రాయమని చెప్పారు. అమెరికాలో నివసిస్తున్న వలసదారులను వెనక్కి పంపించడంపై ట్రంప్ కు ఆమె మద్దతు పలికారు. ఒబామా హయాంలో కూడా ఇదే పనిని మరో విధంగా నిర్వహించారని... ఇప్పటి కంటే అప్పుడు ఎక్కువ మందిని పంపించేశారని తెలిపారు. ఒబామాకు శాంతి బహుమతి రావడం తనను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తోందని చెప్పారు.

susan sarandon
hollywood
obama
trump
Hillary Clinton
  • Loading...

More Telugu News