maharashtra: ఖైదీలకు కుటుంబ సభ్యులతో వీడియో కాల్... కొత్త సదుపాయం కల్పించిన మహారాష్ట్ర ప్రభుత్వం
- జైలు జీవితంలో కొంత ఆనందం కల్పించే యత్నం
- మంజులా షెత్యే మరణం తర్వాత జైళ్లలో సంస్కరణలు
- అండర్ ట్రయల్స్ ఖైదీలకు ఈ సదుపాయం లేదు
ఖైదీలకు వారి జైలు జీవితంలో కొంత ఆనందం కల్పించడం కోసం కుటుంబసభ్యులతో వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇటీవల బైకుల్లా జైల్లో జరిగిన ఖైదీ మంజులా షెత్యే మరణం కారణంగా తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా దీన్ని అందుబాటులోకి తెచ్చారు. జైలు అధికారుల వేధింపుల కారణంగానే ఆమె మరణించిందని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సదుపాయం అండర్ ట్రయల్స్ ఖైదీలకు లేదని ఐజీ (జైళ్లు) రాజ్యవర్థన్ సిన్హా తెలిపారు. సిటీలో ఉన్న జైళ్లలో రద్దీ కారణంగా యెరవాడ, తలోజా, ఔరంగాబాద్ వంటి సుదూర ప్రాంతాల్లో ఉండే జైళ్లకు పంపిన వారు బంధువులతో కలిసేందుకు ఇబ్బందులు ఎదుర్కుంటున్న కారణంగా వారికి ఈ అవకాశాన్ని కల్పించినట్లు ఆయన తెలిపారు.