KTR: ఆనందించే సమయమిది... వివాదాల జోలికి వెళ్లబోను: కేటీఆర్

  • మెట్రో రైలుకు కారణం కాంగ్రెస్ పార్టీయేనన్న ఉత్తమ్ కుమార్
  • ఉత్తమ్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్
  • ఆనందించాల్సిన సమయంలో వివాదాలు ఎందుకు?
  • కొన్నాళ్ల తరువాత విజయం, వైఫల్యంపై మాట్లాడాలని సూచన

మెట్రో రైలు హైదరాబాద్ కు రావడానికి కారణం కాంగ్రెస్ చేసిన కృషేనని, తమ హయాంలోనే సర్వే, కాంట్రాక్టు, సగం పనులు ముగిశాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. మెట్రో కోసం కేసీఆర్ చేసిందేమీ లేదని ఉత్తమ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఇది ఆనందించాల్సిన సమయమని, ఈ సమయంలో తాను వివాదాల జోలికి వెళ్లబోనని చెప్పారు.

నగరానికి మెట్రో ఓ మణిహారంలా నిలుస్తుందని, ఇది తమ ప్రభుత్వానికి అరుదైన గౌరవమని అన్నారు. అతిథులు వస్తున్న కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కాబట్టి, నగరవాసులు సహకరించాలని కోరారు. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే, ఇక్కడ చార్జీలు తక్కువగానే ఉన్నాయని, అనతి కాలంలోనే మెట్రో సేవల ప్రాధాన్యతను ప్రజలు తెలుసుకుంటారని అన్నారు. ఆ తరువాత విజయం, వైఫల్యం గురించి మాట్లాడితే మంచిదని హితవు పలికారు.

KTR
Uttam Kumar Reddy
Hyderabad metro
  • Loading...

More Telugu News