Manushi Chhillar: అమీర్ ఖాన్ తో నటించాలని ఉంది: మనసులో మాట బయటపెట్టిన మానుషి చిల్లర్

  • 16 ఏళ్ల తరువాత భారత్ నుంచి మిస్ వరల్డ్ 
  • బాలీవుడ్ పై అప్పుడే కోరికలు లేవు 
  • ఆమిర్ ఖాన్, ప్రియాంకా చోప్రా ఇష్టం

16 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత భారతదేశానికి మిస్‌ వరల్డ్‌ కిరీటం అందించిన మానుషి చిల్లర్‌.. తనకు సినిమాల్లోకి ఇప్పుడే వచ్చేయాలన్న కోరిక లేదని తెలిపింది. బాలీవుడ్ లో నటించాల్సి వస్తే ఆమిర్ ఖాన్ చిత్రంలో అయితే బాగుంటుందని తెలిపింది. ఆమిర్ ఖాన్ వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తాడని, తన ప్రతి సినిమా విభిన్నంగా ఉండేలా చూసుకుంటాడని చెప్పింది.

అంతే కాకుండా తన ప్రతిసినిమాతో సమాజానికి ఏదో ఒక సందేశం ఇస్తాడని తెలిపింది. సామాజిక సందేశాలతో తెరకెక్కే ఆమిర్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. బాలీవుడ్‌ నటీనటులంతా ఇష్టమేనన్న మానుషి చిల్లర్.. ఆమిర్‌ ఖాన్‌, ప్రియాంకచోప్రాలు తన అభిమాన నటీనటులని తెలిపింది. 

Manushi Chhillar
miss world
Bollywood
  • Loading...

More Telugu News