: పార్లమెంటులో కొలువుదీరిన అందాల రాముడు


తెలుగు నటనా సార్వభౌముడు, మచ్చలేని రాజకీయ నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహం రాజ్యసభ ప్రవేశ ద్వారం వద్ద కొలువు దీరింది. 9.3 అడుగుల ఎత్తున్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని స్పీకర్ మీరాకుమార్ 10.30గంటలకు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్ సింగ్, ఉప రాష్ట్రపతి అన్సారీ, కేంద్ర మంత్రులు జైరాం రమేశ్, గులాంనబీ అజాద్, పురందేశ్వరి, పళ్లంరాజు, జైపాల్ రెడ్డి, చిరంజీవి, కిల్లి కృపారాణి, సర్వే సత్యన్నారాయణ, సుష్మాస్వరాజ్, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, అరుణ్ జైట్లీ, ములాయం సింగ్ యాదవ్, తదితర నేతలు హాజరయ్యారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి కూడా విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News