Chandrababu: 200 'అన్న' క్యాంటీన్లను ప్రారంభిస్తున్నాం!: అసెంబ్లీలో చంద్ర‌బాబు

  • 2018 ఆరంభంలోనే 'అన్న క్యాంటీన్లు'
  • జ‌న‌వ‌రి 1 నుంచి పెళ్లి కానుక కింద పేద‌ల‌కు ఆర్థిక సాయం
  • హిజ్రాల‌కు కూడా వెయ్యి రూపాయ‌ల చొప్పున పింఛ‌న్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 200 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. ఈ రోజు అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతూ... నూత‌న సంవ‌త్స‌రం 2018 మొద‌ట్లోనే అన్న క్యాంటీన్లను పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామ‌ని తెలిపారు. అలాగే డ్వాక్రా సంఘాల ద్వారా ప్ర‌తి కుటుంబానికి నెల‌కు రూ.10 వేల ఆదాయం వ‌చ్చేలా చేస్తామ‌ని అన్నారు. జ‌న‌వ‌రి 1 నుంచి పెళ్లి కానుక కింద పేద‌ల‌కు ఆర్థిక సాయం చేస్తామ‌ని అన్నారు.

త్వ‌ర‌లో హిజ్రాల‌కు కూడా వెయ్యి రూపాయ‌ల చొప్పున పింఛ‌న్లు ఇస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. చ‌దువు, ఆరోగ్యం, పెళ్లిళ్ల‌ వ‌ల్ల పేద‌ల ఖ‌ర్చులు పెరుగుతున్నాయని, వారి ఆదాయం పెర‌గాల్సి ఉంద‌ని అన్నారు. చంద్ర‌న్న బీమా ద్వారా స‌హ‌జ మ‌ర‌ణ‌మైనా రూ.2 ల‌క్ష‌ల బీమా అందిస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో నాణ్య‌మైన చ‌దువు అందించ‌డానికి కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. 

  • Loading...

More Telugu News