delhi: అరవింద్‌ కేజ్రీవాల్‌కు.. రూ.30.67 కోట్ల పన్ను నోటీసు జారీ

  • వ‌చ్చేనెల 7 లోపు సమాధానమివ్వాలి
  • రూ.13 కోట్ల ఆదాయానికి సంబంధించి కూడా ఆప్ వివ‌రాలు చెప్ప‌లేదు
  • విదేశాల నుంచి సేకరించిన విరాళాలను కూడా తెల‌ప‌లేదు

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు రూ.30.67 కోట్ల ఆదాయ‌ పన్ను నోటీసులు జారీ అయ్యాయి. వ‌చ్చే నెల 7 లోపు వీటికి సమాధానమివ్వాలని ఆదాయ‌పు ప‌న్ను శాఖ పేర్కొంది. అలాగే రూ.13 కోట్ల ఆదాయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించలేదని కూడా తెలిపింది. ఆ డ‌బ్బులు ఎలా వ‌చ్చాయనే అంశంపై 462 దాతలకు చెందిన వివరాలను రికార్డు చేయలేదని పేర్కొంది.

 కాగా, ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ప‌లు ఆదేశాలు వ‌చ్చాయి. విదేశాల నుంచి సేకరించిన విరాళాలను ఆమ్ ఆద్మీ పార్టీ తెల‌పాల‌ని అప్ప‌ట్లో ఆదేశించింది. ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ను స‌ద‌రు పార్టీ ఉల్లంఘించిందని తెలిపింది.  

  • Loading...

More Telugu News