giddi eswari: జగన్ వ్యవహారశైలి నచ్చలేదు.. నా ఆత్మాభిమానం దెబ్బతింది: గిడ్డి ఈశ్వరి

  • వైసీపీ కోసం శాయశక్తులా కృషి చేశా
  • సరైన గుర్తింపును కూడా ఇవ్వలేదు
  • సీఎం సహకారంతో గిరిజనుల ఉన్నతి కోసం పని చేస్తా

వైసీపీలో ఉన్నన్నాళ్లు పార్టీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేశానని... అయినా తన శ్రమను గుర్తించలేదని టీడీపీలో చేరిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. వైసీపీ అధినేత వ్యవహారశైలి తనకు నచ్చలేదని... ఆత్మాభిమానాన్ని చంపుకోలేకే టీడీపీలో చేరానని ఆమె చెప్పారు. హుదూద్ తుపాను సంభవించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కఠోర దీక్షతో పని చేశారని... ఆయన కృషి వల్ల గిరిజన, మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయని అన్నారు. తాను గిరిజనుల పక్షపాతినని... గిరిజన హక్కుల కోసం చంద్రబాబు సహకారంతో పని చేస్తానని చెప్పారు. ఎంతో నమ్మకంతో తనను ప్రజలు ఎన్నుకున్నారని... వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, తన బాధ్యతలను నిర్వహిస్తానని తెలిపారు.

giddi eswari
paderu constituency
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News