giddi eshwari: వైసీపీ నుంచి టీడీపీలోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు!

  • మరికాసేపట్లో పచ్చ కండువా కప్పుకోనున్న గిడ్డి ఈశ్వరి
  • క్యూలైన్ లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారంటున్న టీడీపీ వర్గాలు
  • గిడ్డితో కలిపితే ఫిరాయింపు ఎమ్మెల్యేల సంఖ్య 22కు చేరిక

పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నేడు ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె తన అనుచరగణంతో విజయవాడకు చేరుకున్నారు. ఇక మరో ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి తదితరులు వీరితో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
 
ఇప్పటివరకూ వైకాపా టికెట్ పై గెలిచి రాజీనామా చేయకుండా టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల సంఖ్య 22 కాగా, గిడ్డి ఈశ్వరిని కూడా కలుపుకుంటే ఆ సంఖ్య 23 కానుంది. ఇక్కడ సాంకేతికంగా పరిశీలిస్తే, భూమా నాగిరెడ్డి మరణం తరువాత, తెలుగుదేశం తరఫున పోటీ పడ్డ భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచారు కాబట్టి, వైకాపా టికెట్ పై గెలిచి, టీడీపీలో కొనసాగుతున్న వారి సంఖ్యను 22గా భావించాల్సి వుంటుంది.

కాగా, త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రానికి మూడు స్థానాలు లభిస్తాయి. ఈ మూడింటిలో ప్రస్తుతమున్న బలాబలాలను పరిశీలిస్తే, తెలుగుదేశం పార్టీకి 2, వైకాపాకు 1 స్థానం దక్కుతుంది. కనీసం మరో ముగ్గురు జగన్ వర్గ ఎమ్మెల్యేలు జంప్ చేస్తే, మూడు సీట్లనూ టీడీపీ కైవసం చేసుకుంటుంది. ఈ ఎత్తుగడను అమలు చేయాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు పావులు కదుపుతున్నట్టు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక వైకాపా నుంచి ఫిరాయించనున్న ఎమ్మెల్యేలు ఎవరన్న విషయంలో మాత్రం అధికారిక సమాచారం లేనప్పటికీ, కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే టీడీపీతో టచ్ లో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News