Joe Root: గంటకు 144 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరిన స్టార్క్.. పగిలిన ఇంగ్లండ్ కెప్టెన్ హెల్మెట్!

  • మిచెల్ స్టార్క్ బౌన్సర్‌కు పగిలిన హెల్మెట్ గ్రిల్
  • పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న రూట్
  • వైద్యుల సలహాతో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ కెప్టెన్

ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతికి ఇంగ్లండ్ కెప్టెన్ జోయ్ రూట్ హెల్మట్ బద్దలైంది. యాషెస్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో మూడో రోజు ఈ ఘటన చోటుచేసుకుంది. స్టార్క్ 144 కిలోమీటర్ల వేగంతో విసిరిన బౌన్సర్ నేరుగా రూట్ హెల్మట్‌కు తాకడంతో హెల్మెట్ గ్రిల్ బద్దలైంది. బంతి బలంగా తాకినా హెల్మెట్ ఉండడంతో రూట్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు పర్వాలేదని చెప్పడంతో రూట్ ఆట కొనసాగించాడు. 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హాజెల్ వుడ్ బౌలింగ్‌లో రూట్ ఎల్బీగా వెనుదిరిగాడు.

Joe Root
England
Australia
Mitchell Starc
Ashes
  • Loading...

More Telugu News