Cricket: సెంచరీలు బాదిన చటేశ్వర పుజారా, మురళీ విజయ్.. భారీ స్కోరు దిశగా టీమిండియా
- టీమిండియా స్కోరు ప్రస్తుతం 279/2 (90 ఓవర్లకి)
- క్రీజులో పుజారా 108, విరాట్ కోహ్లీ 34
- 128 పరుగులు చేసి ఔటైన మురళీ విజయ్
నాగ్‌పుర్‌లో జరుగుతోన్న శ్రీలంక-భారత్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణిస్తున్నారు. టీమిండియా భారీ స్కోరు చేసే అవకాశముంది. రెండో రోజు 11/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్‌మెన్ విజయ్, పుజారాలు క్రీజులో పాతుకుపోయారు. మురళి విజయ్ చూడచక్కని షాట్లతో 187 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో తన కెరీర్‌లో 10వ సెంచరీ పూర్తి చేసుకోగా, మరో బ్యాట్స్‌మెన్ చటేశ్వర పుజారా 246 బంతుల్లో 100 పరుగులు బాది తన కెరీర్‌లో 14వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ప్రస్తుతం క్రీజులో క్రీజులో పుజారా (108), విరాట్ కోహ్లీ (34) ఉన్నారు. టీమిండియా స్కోరు ప్రస్తుతం 279/2(90 ఓవర్లకి)గా ఉంది. టీమిండియా ఓపెనర్లు లోకేశ్ రాహుల్ 7, మురళీ విజయ్ 128 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో గామేజ్, హెరత్‌లకి చెరో వికెట్ లభించాయి.
14th Test 100 for @cheteshwar1 and 4th vs Sri Lanka #INDvSL pic.twitter.com/OSglC0nRVd
— BCCI (@BCCI) November 25, 2017