narayana: 2019లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు: నారాయణ

  • నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీని ప్రజలు తిరస్కరించారు
  • నెల్లూరుకు 30 వేల ఇళ్లు కేటాయించాం
  • నిర్మాణంలో అత్యున్నత టెక్నాలజీ వాడుతున్నాం

నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీని ప్రజలు తిరస్కరించారని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. 2019లో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. ఈ రోజు నెల్లూరులో నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరుకు 30 వేల ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. అవసరమైతే మరో 10 వేల ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణంలో అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నామని తెలిపారు. 

narayana
minister narayana
ntr houses
YSRCP
  • Loading...

More Telugu News