raviteja: 30 కోట్ల షేర్ ను రాబట్టి .. లాభాలను తెచ్చిపెట్టిన 'రాజా ది గ్రేట్'

  • రవితేజ హీరోగా వచ్చిన 'రాజా ది గ్రేట్'
  • విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి భారీ వసూళ్లు 
  • అనిల్ రావిపూడి .. మెహ్రీన్ కి దక్కిన హ్యాట్రిక్ హిట్

'పటాస్' .. 'సుప్రీమ్' తరువాత 'రాజా ది గ్రేట్' సినిమా చేసిన అనిల్ రావిపూడి హ్యాట్రిక్ హిట్ ను కొట్టాడు. హీరో అంధుడిగా కనిపిస్తాడు అనే సరికి .. ఈ సినిమా సక్సెస్ విషయంలో చాలామంది సందేహాలను వ్యక్తం చేశారు. ఈ కారణంగానే ఈ సినిమాను కొంతమంది హీరోలు వదులుకున్నారు కూడా. అలాంటి ఈ సినిమా అనూహ్యమైన రీతిలో విజయాన్ని సాధించింది. భారీ వసూళ్లను రాబడుతూ రవితేజకి పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది.

ఫుల్ రన్ లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే 30 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వచ్చాయి. ఈ సినిమాతో మెహ్రీన్ కూడా హ్యాట్రిక్ హిట్ ను అందుకుని .. వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ వెళుతోంది. ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించినందుకు .. లాభాలను తెచ్చిపెట్టినందుకు అంతా ఆనందిస్తూ .. తరువాత ప్రాజెక్టులకి సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు.        

  • Loading...

More Telugu News