pavankalyan: కాశీ విశ్వనాథుడి సన్నిధి నుంచి 'అజ్ఞాతవాసి' టైటిల్ ప్రకటన!

  • కాశీకి బయలుదేరిన 'అజ్ఞాతవాసి' టీమ్ 
  • టైటిల్ ప్రకటనలో కొత్త పద్ధతి 
  • గయా .. అలహాబాద్ లోను చిత్రీకరణ
  • జనవరి 10న ప్రేక్షకుల ముందుకు  

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా 'అజ్ఞాతవాసి' చిత్రం తెరకెక్కుతోంది. కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం ఈ సినిమా యూనిట్ ఈ రోజున కాశీ వెళుతోంది. కాశీ .. గయా .. అలహాబాద్ ప్రాంతాల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

 ఈ 27న టైటిల్ ను వెల్లడించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కాశీ నుంచే ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. కాశీలోని విశ్వనాథుడి ఆలయంలో .. 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ వున్న బాక్స్ ను ఓపెన్ చేసి టైటిల్ ను ప్రకటించనున్నారట. ఇలా విశ్వనాథుడి సన్నిధి నుంచి టైటిల్ ను ప్రకటించడమనేది ఇదే మొదటిసారి అని అంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.     

pavankalyan
trivikram
  • Loading...

More Telugu News