Gabba Pool Proposal: క్రికెట్ మ్యాచ్ మధ్యలో స్విమ్మింగ్ పూల్ లో ప్రపోజ్ చేసిన ప్రియుడు.. సోషల్ మీడియాలో వైరల్... మీరు కూడా చూడండి!

  • క్వీన్స్ లాండ్ లోని గబ్బా స్టేడియం వేదికగా ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక యాషెస్ టోర్నీ
  • తొలిటెస్టు రెండో రోజు ఆటకు కాస్త రొమాన్స్ జత
  • స్టేడియంలో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ లో ప్రేమజంట ప్రపోజల్

ప్రతిష్ఠాత్మక యాషెస్‌ టోర్నీ ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమైంది. ఈ సిరీస్‌ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు బ్రిస్బేన్ లోని చారిత్రక గబ్బా స్టేడియంలో జరుగుతోంది. మ్యాచ్ సందర్భంగా గబ్బా స్టేడియంను వినూత్నంగా తీర్చిదిద్దారు. స్టాండ్స్ తీసేసి అక్కడ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. ఈ పూల్ లో జలకాలాడుతూ మ్యాచ్ ను వీక్షించే వెసులుబాటు కల్పించారు. దీంతో ఈ సారి మ్యాచ్ కు కాస్త రొమాన్స్ కూడా జత కలిసింది. మ్యాచ్ రసవత్తరంగా జరుగుతోంది.

ఇక తొలి టెస్టు రెండో రోజు లంచ్ విరామానికి వెళ్లిన ఆటగాళ్లు క్రీజులో అడుగుపెడుతున్న సమయంలో ప్రేమజంట మిచెల్, టోరీ స్విమ్మింగ్ పూల్ దగ్గర రొమాన్స్ లో మునిగిపోయారు. ప్రతిష్ఠాత్మక యాషెస్ కంటే మంచి సందర్భం లేదని భావించిన మిచెల్, పక్కనే ఉన్న ప్రియురాలు టోరీకి ప్రపోజ్ చేశాడు. అతని ప్రపోజల్ కు ఆమె కరిగిపోయింది. దీంతో వెంటనే ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. ఆమె అతనికి అధర చుంభనంతో తన ప్రేమను వ్యక్తం చేసింది. ఈ సన్నివేశం అక్కడి వారందర్నీ ఆనందంలో ముంచెత్తింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది. వారి ప్రపోజల్ ను మీరు కూడా చూడండి.

Gabba Pool Proposal
Ashes Test
lovers
Michael and Tori
  • Error fetching data: Network response was not ok

More Telugu News