padmavathi: అప్లికేషన్ లో ఆ కాలం నింపలేదు... అందుకే సెన్సార్ ఇంకా పూర్తి కాలేదు!: 'పద్మావతి'పై సెన్సార్ బోర్డు వివరణ
- సెన్సార్ చేసేందుకు సీబీఎఫ్సీకి 68 రోజుల సమయం ఉంటుంది
- అప్లికేషన్ లో ఒక కాలమ్ ఫిల్ చెయ్యలేదు
- సినిమా చరిత్ర ఆధారంగా తీశారా? ఫిక్షన్ ఆధారంగా తీశారా? అన్న కాలమ్ ను పూరించలేదు
‘పద్మావతి’ సినిమాకి ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ జారీ కాని సంగతి తెలిసిందే. దీంతో మరిన్ని వివాదాలకు కారణం కాకూడదనే ‘పద్మావతి’ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయలేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు సభ్యులను సంప్రదించగా... సెన్సార్ సర్టిఫికేట్ కోసం పంపిన దరఖాస్తును పూర్తిగా పూరించలేదని బోర్డు సీఈవో అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.
సినిమాను చరిత్ర ఆధారంగా తీశారా? లేక ఫిక్షన్ ఆధారంగా తీశారా? అన్న కాలమ్ ను పూరించలేదని, ఆ కాలమ్ ను ఖాళీగా వదిలేశారని, సినిమా విడుదల సమయంలో కొన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం తమకు అవసరమని ఆయన చెప్పారు. అందుకే ‘పద్మావతి’ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని తెలిపారు. నిబంధనల ప్రకారం ఒక సినిమాను సర్టిఫై చేసేందుకు సీబీఎఫ్సీకి 68 రోజుల సమయం ఉంటుందని ఆయన అన్నారు.