egypt: ఈజిప్టులో ఉగ్రవాదుల బీభత్సం.. 184 మంది మృతి.. భయంతో జనం పరుగులు!
- సినాయ్ ప్రార్థనామందిరం వద్ద రెచ్చిపోయిన ఉగ్రవాదులు
- మసీదులో బాంబు పేలుడు
- మసీదు బయట తూటాల వర్షం కురిపించిన ఉగ్రమూకలు
- మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ఈజిప్ట్ ప్రభుత్వం
ప్రతి రోజూ ఏదో ఓ చోట దాడులు జరుపుతూ కలకలం రేపుతోన్న ఉగ్రవాదులు ఈజిప్ట్‌లో రెచ్చిపోయారు. సినాయ్ ప్రార్థనామందిరం వద్ద పెను బీభత్సం సృష్టించారు. ముందు మసీదు లోపల బాంబుపేల్చి పదుల సంఖ్యలో మనుషుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు, అనంతరం బయటకు పారిపోతోన్న వారిపై కూడా దాడులకు తెగబడ్డారు.
మసీదు వద్దకు నాలుగు వాహనాల్లో వచ్చిన ఉగ్రవాదులు.. భయంతో బయటకు పరుగులు తీస్తోన్న ప్రజలపై తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో 184 మంది మృతి చెందగా మరో 150 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈజిప్ట్ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.