Cricket: సంచ‌ల‌నం... నాగాలాండ్ జ‌ట్టుపై మొద‌టి బంతికే విజ‌యం సాధించిన కేర‌ళ జ‌ట్టు!

  • మ‌హిళ‌ల అండ‌ర్ 19 క్రికెట్‌లో అద్భుతం
  • 2 ప‌రుగుల‌కే ఆలౌటైన నాగాలాండ్ జ‌ట్టు
  • ఒక్క ప‌రుగు చేసిన‌ నాగాలాండ్ ఓపెన‌ర్‌
  • మ‌రో ప‌రుగు వైడ్ రూపంలో వ‌చ్చిన వైనం

మ‌హిళ‌ల అండ‌ర్ 19 క్రికెట్‌లో అద్భుతం జ‌రిగింది. కేర‌ళ‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేవ‌లం 2 ప‌రుగుల‌కే నాగాలాండ్ కుప్ప‌కూలింది. బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో గుంటూరులో జ‌రుగుతోన్న ఈ టోర్నీలో నాగాలాండ్‌ 17 ఓవర్లు ఆడి, కేవ‌లం 2 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆ రెండు ప‌రుగుల్లో ఒక ప‌రుగుని ఓపెనర్ మేనక చేయ‌గా, మ‌రో ప‌రుగు వైడ్ రూపంలో ల‌భించింది.

కేర‌ళ బౌల‌ర్ల‌లో మిన్నూ మణి 4, సౌరభ్య 2, సంద్ర సురేన్, బిబీ సెబాస్టియన్ చెరో వికెట్ తీశారు. అనంత‌రం మూడు పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగుకు దిగిన కేర‌ళ జట్టు ఒక్క బంతికే బౌండరీ కొట్టి, విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో కేర‌ళ‌ క్రీడాకారిణులు చేసిన బౌలింగ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News