Chandrababu: ఉండవల్లి లో చంద్రబాబు నివాసం వద్ద కలకలం... తగలబడ్డ కారు!

  • ఉండవల్లి కరకట్ట వద్ద ప్రమాదం
  • బుగ్గి అయిన మహీంద్రా కారు
  • పరిస్థితిని సమీక్షిస్తున్న పోలీసులు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద కలకలం రేగింది. ఉండవల్లి కరకట్ట వద్ద ఓ మహీంద్ర XUV కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కారులో ఉన్నవారు వెంటనే అప్రమత్తమై, కిందకు దిగేశారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. వీరంతా రాయపూడి మీదుగా వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ, ఎలాంటి ప్రమాదం జరగలేదు. ముఖ్యమంత్రి నివాసం సమీపంలో ప్రమాదం జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. క్షణాల మీద అక్కడకు చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. కారు వివరాలతో పాటు, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కారు కర్ణాటక రిజిస్ట్రేషన్ ను కలిగి ఉంది.

Chandrababu
CAR ACCIDENT
UNDAVALLI
UNDAVALLI KARAKATTA
  • Loading...

More Telugu News