Vijayawada: విజయవాడలో శ్రుతి మించుతున్న బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు!

  • రెచ్చిపోతున్న బ్లేడ్ బ్యాచ్
  • బ్లేడ్లతో భయపెడుతూ దోచుకుంటున్న వైనం
  • పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు

విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయి. తాజాగా నగరంలోని కండ్రిగలో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయింది. వివరాల్లోకి వెళ్తే, కృష్ణ లంకకు చెందిన పలువురు వనసమారాధన కోసం కండ్రిగకు వచ్చారు. వీరిని, బ్లేడ్లతో బెదిరించిన దుండగులు నగదు, సెల్ ఫోన్లను దోచుకున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. రాత్రివేళల్లో మోటార్ సైకిళ్లపై వెళ్లేవారిని టార్గెట్ చేస్తున్న బ్లేడ్ బ్యాచ్... వారిని బెదిరిస్తూ, దొరికినకాడికి దోచుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Vijayawada
blade batch
  • Loading...

More Telugu News