namita: పెళ్లయినా నమిత సినీ పరిశ్రమకు దూరం కాదు!: భర్త వీరేన్ చౌదరి

  • తమిళ, తెలుగు, కన్నడ అభిమానుల ఆశీర్వాదంతో వివాహం ఆనందంగా జరిగింది
  • వివాహానంతరం సినీ పరిశ్రమకు నమిత దూరం కావడం లేదు
  • మంచి క్యారెక్టర్లు వస్తే నటిస్తుంది

తమిళ, తెలుగు, కన్నడ అభిమానుల ఆశీర్వాదంతో తన వివాహం ఆనందంగా జరిగిందని సినీ నటి నమిత తెలిపింది. తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ లో వివాహం అనంతరం నమిత మాట్లాడుతూ, తనను ఆదరించిన టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.

అనంతరం ఆమె భర్త వీరేన్ చౌదరి మాట్లాడుతూ, తమ దంపతులకు అభిమానుల ఆశీర్వాదం కావాలని అన్నారు. వివాహానంతరం నమిత సినిమాలకు దూరం కాదని ఆయన చెప్పారు. మంచి క్యారెక్టర్లు వస్తే చేస్తుందని ఆయన చెప్పారు. సినిమా నిర్మాణంలో కూడా పాలుపంచుకోవాలనుకుంటున్నామని, కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. దీనంతటికీ అభిమానుల ఆశీర్వాదం కావాలని, వారు ఆదరిస్తారని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. ఇంతవరకు తమను ఆదరించిన వారందరికీ ధన్యవాదాలని ఆయన తెలిపారు. 

namita
veeren choudary
movies
acting
  • Loading...

More Telugu News