media courses: మీడియాలోకి రావాలనుకుంటున్న వారికి శుభవార్త.. తక్కువ ఖర్చుతో కోర్సులు అందిస్తున్న ఏఎంఎస్!

  • ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలోకి రావాలనుకునే వారికి మంచి అవకాశం
  • మూడు కోర్సులను అందిస్తున్న ఏఎంఎస్
  • MS Office - SIVE సర్టిఫికేషన్ కోర్సు కూడా 

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలోకి రావాలనుకునే ఔత్సాహికులకు శుభవార్త. హైదరాబాదులోని దుర్గాబాయ్ దేశ్ ముఖ్ మహిళా సభ (ఏఎంఎస్) తక్కువ ఖర్చుతోనే మీడియా కోర్సులను అందిస్తోంది. నిరుద్యోగులు, కాలేజీ విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఏఎంఎస్ ప్రతినిధి నాగలక్ష్మి కోరారు. ఈ కోర్సుల ద్వారా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవచ్చని తెలిపారు.

కోర్సుల వివరాలు:
వీడియో అండ్ ఫిల్మ్ ఎడిటింగ్ - 40 రోజులు
గ్రాఫిక్ డిజైనింగ్ - 40 రోజులు
మీడియా రైటింగ్ (తెలుగు) - 40 రోజులు

వేదిక: లిటరసీ హౌస్, దుర్గాబాయ్ దేశ్ ముఖ్ మహిళా సభ (ఏఎంఎస్) కాలేజ్ క్యాంపస్, ఉస్మానియా యూనివర్శిటీ రోడ్, హైదరాబాద్-7

రిజిస్ట్రేషన్లకు చివరి తేది: 28-11-2017
బ్యాచ్ ప్రారంభ తేది: 30-11-2017

కాంటాక్ట్ నంబర్లు: 27098406, 27096464, 9951210441
ఈమెయిల్: durgabai07@yahoo.co.in

ఈ కోర్సులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 'ఎంఎస్ ఆఫీస్ (MS Office)'కు సంబంధించిన ‘SIVE’ సర్టిఫికేషన్ ను కూడా ఏఎంఎస్ ఆఫర్ చేస్తోంది. గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ కోర్సు కంపల్సరీ. ఆసక్తి కల విద్యార్థులు, నిరుద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఏఎంఎస్ కోరింది. 

  • Loading...

More Telugu News