sudheer babu: సుధీర్ బాబు కొత్త సినిమా షూటింగ్ మొదలైంది!

  • 'అమీతుమీ' తరువాత ఇంద్రగంటి మూవీ 
  • కథానాయకుడిగా సుధీర్ బాబు 
  • ఆయన జోడీగా అదితీరావు హైదరీ  

'ప్రేమకథా చిత్రం' .. ' భలేమంచి రోజు' సినిమాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు వచ్చిన తరువాత, కథల ఎంపికలో సుధీర్ బాబు మరింత జాగ్రత్త వహిస్తూ వస్తున్నాడు. తన బాడీ లాంగ్వేజికి తగిన పాత్రలు .. కొత్తగా తనని చూపించే పాత్రలను మాత్రమే ఆయన ఎంచుకుంటూ వస్తున్నాడు. అలాంటి సుధీర్ బాబు తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

 ఈ సినిమా షూటింగ్ ఈ రోజున మొదలైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ పేరు వినగానే 'అష్టా చెమ్మా' .. 'జెంటిల్ మేన్' .. 'అమీ తుమీ' సినిమాలు గుర్తుకువస్తాయి. అలాగే ఒక వైవిధ్యభరితమైన కథాంశంతో .. సుధీర్ బాబు హీరోగా ఆయన ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన కథానాయికగా అదితీరావు హైదరీ కనిపించనుంది. వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.     

sudheer babu
aditi rao
  • Loading...

More Telugu News