parthasarathi: చంద్రబాబు మహా నటుడు.. నందులు ఆయనకే ఇవ్వాలి!: పార్థసారథి

  • అసెంబ్లీలో చంద్రబాబు నటన బాగుంది
  • టీడీపీ రైతు వ్యతిరేక పార్టీ
  • నిరసన తెలిపే హక్కు కూడా రైతులకు లేకుండా పోయింది

అసెంబ్లీలో చంద్రబాబు నటనకు నంది అవార్డులు ఇవ్వాలని వైసీపీ నేత పార్థసారథి అన్నారు. పోలవరం ప్రాజెక్టును బాబు ఒక ప్రహసనంగా మార్చేశారని... పోలవరం పూర్తి కావడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే ఎన్టీయేలో ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. నకిలీ విత్తనాలకు ఏపీ నిలయంగా మారిందని అన్నారు. టీడీపీ పాలనను రైతులు భరించలేక పోతున్నారని చెప్పారు. నిరసన తెలిపే హక్కు కూడా రైతులకు లేకుండా పోయిందని అన్నారు. ప్రతిపక్షాలను, ఉద్యోగులను, నష్టపోయిన రైతులను కలవాలంటేనే ప్రభుత్వం భయపడుతోందని చెప్పారు. కృష్ణా జిల్లా మంత్రులు దద్దమ్మల్లా తయారయ్యారని దుయ్యబట్టారు. నంది అవార్డులను టీడీపీ మద్దతుదారులకే ప్రకటించారని మండిపడ్డారు.

parthasarathi
YSRCP
Chandrababu
polavaram
nandi awards
  • Loading...

More Telugu News