surfting: వ‌ర‌ద నీటిలో స‌ర్ఫింగ్ చేసిన ముస్లిం మ‌హిళ‌... వీడియో చూడండి

  • బుర్ఖా ధ‌రించి స‌ర్ఫింగ్‌
  • వైర‌ల్ అవుతున్న వీడియో
  • సౌదీ అరేబియాలోని జెడ్డాలో వినూత్న‌య‌త్నం

ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు సౌదీ అరేబియాలోని జెడ్డా న‌గ‌రం వ‌ర‌ద నీటితో నిండిపోయింది. వ‌ర్షాలు త‌గ్గిన‌ప్ప‌టికీ కొన్ని పాంత్రాల్లో వ‌ర‌ద నీరు అలాగే నిలిచిఉంది. ఈ వ‌ర‌ద నీటిలో ఓ ముస్లిం మ‌హిళ‌ స‌ర్ఫింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఒక కారుకి తాడు క‌ట్టి, దాని స‌హాయంతో బుర్ఖా వేసుకున్న మ‌హిళ స‌ర్ఫింగ్ చేయ‌డం ఈ వీడియోలో చూడొచ్చు.

ఈ వీడియోను జోయెస్ క‌రామ్ అనే ఓ రిపోర్ట‌ర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసింది. పోస్ట్ చేసిన కొద్ది సేప‌టికే వీడియో వైర‌ల్‌గా మారింది. అంతేకాకుండా ఈ వీడియోను ఆద‌ర్శంగా తీసుకుని సౌదీలోని ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన వారు కూడా ఈ త‌ర‌హా వీడియోలు చేసి పోస్టు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News