no smoking: 'ఆనందాన్ని ఎవరు కోరుకోరు?' అనే యాడ్‌లో కనిపించే పాప ఇప్పుడెలా ఉందో చూడండి!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-385f65e58a31c415e3edd3e1be0a2ecb3f0c6dac.jpg)
- సీరియళ్లు, సినిమాలతో బిజీ అయిన సిమ్రన్ నటేకర్
- ఎన్నో ఏళ్లుగా థియేటర్లలో కనిపిస్తున్న నటి
- చాలా ప్రకటనల్లో కనిపించిన సిమ్రన్
థియేటర్లో సినిమా ప్రారంభానికి ముందు 'ఆనందాన్ని ఎవరు కోరుకోరు?' అంటూ ప్రకటన వస్తుంది. అందులో తన తండ్రితో కలిసి టీవీ చూస్తున్నప్పుడు, తండ్రి దగ్గుతుండగా పక్కనే ఉన్న కూతురు చూసే చూపులో చాలా అర్థం ఉంటుంది. ఆ ఒక్క చూపుతో సిగరెట్ ఎందుకు తాగానా? అని ఆ తండ్రి పశ్చాత్తాపపడటం ఆ ప్రకటనలో కనిపిస్తుంది.
అంత చిన్నవయసులో తన మొదటి ప్రకటనలోనే నటనతో ఆకట్టుకున్న ఆ పాప పేరు సిమ్రన్ నటేకర్. ఇప్పుడు సీరియళ్లు, సినిమాలు, ప్రకటనలతో చాలా బిజీగా ఉంది. 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌లో పూజ పాత్ర పోషించింది ఆ పాపే. ఆ సీరియల్ మాత్రమే కాదు పెహ్రేదార్ పియా కీ, లవ్ జిందగీ, హాథిమ్ వంటి చాలా సీరియళ్లలో, 150కి పైగా ప్రకటనల్లో సిమ్రన్ కనిపించింది. ధావత్-ఎ-ఇష్క్, క్రిష్ 3, ఖైదీ బ్యాండ్ వంటి సినిమాల్లో కూడా నటించింది.
![](https://img.ap7am.com/froala-uploads/froala-ac28fbe7d5d7c1358749add419049ff4521975a9.jpg)