Habhajan singh: రిటైర్మెంట్ సలహా ఇచ్చిన ట్విట్టర్ యూజర్‌పై హర్భజన్ చిందులు.. నీలాంటి కుక్కలు అరవడానికి మాత్రమే పనికొస్తాయంటూ కౌంటర్!

  • ట్విట్టర్ యూజర్‌ను కుక్కతో పోల్చిన హర్భజన్
  • అరిచే పనిలోనే ఉండాలని సలహా
  • వైరల్ అవుతున్న భజ్జీ ట్వీట్

టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ శివాలెత్తాడు. రిటైర్మెంట్ సలహా ఇచ్చిన ట్విట్టర్ యూజర్‌పై విరుచుకుపడ్డాడు. నీవో కుక్కవని, అరవడానికి మాత్రమే పనికొస్తావంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

నియోల్ స్మిత్ అనే ట్విటరాటీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి హర్భజన్ తప్పుకుంటే మంచిదని సలహా ఇచ్చాడు. ‘‘క్రికెట్‌లో నీ మంచి రోజులు అయిపోయాయి. కొత్త ట్రిక్కులు నేర్చుకోవడంలో విఫలమైన నీవు గౌరవప్రదంగా తప్పుకో. తెలివి తక్కువగా ప్రవర్తించి పేరును పాడుచేసుకోకు. నీ పని అయిపోయిందన్న సంగతిని గుర్తెరిగి వీలైనంత త్వరగా క్రికెట్ నుంచి తప్పుకుంటే మేలు’’ అని సలహా ఇచ్చాడు.

స్మిత్ ట్వీట్‌పై భజ్జీ అంతెత్తున ఎగిరి పడ్డాడు. తీవ్రస్థాయిలో రిప్లై ఇచ్చాడు. ‘‘నీలాంటి పాత కుక్కలు అరవడానికే పనికొస్తాయి. నువ్వా పనిలోనే ఉండు. నీవు నేర్చుకున్నది ఇంతే అన్నమాట. జీవితంలో ఓడిపోయిన వారే ఇటువంటి సలహాలు ఇస్తుంటారు. నేర్చుకునేందుకు ప్రతి రోజు ఏదో ఒక విషయం ఉంటుంది. ఇతరులకు సలహాలు ఇవ్వడం మానుకో’’ అని ఘాటుగా ట్వీటాడు.

హర్భజన్ ట్వీట్ వైరల్ అయింది. ఆయనపై విమర్శలు కూడా పెరిగాయి. నిన్ను ఇప్పటి వరకు జట్టు మోసింది చాలని, ఇక దయచేస్తేనే మంచిదని కొందరు కామెంట్ చేస్తే.. మరికొందరు బాగా బుద్ధి చెప్పారని భజ్జీని అభినందిస్తున్నారు.

  • Loading...

More Telugu News