North Korea: తమ అధ్యక్షుడిని మరింత రెచ్చగొట్టారంటూ అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉత్తరకొరియా!

  • ఉగ్రవాద దేశంగా పేర్కొనడంతో అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉత్తరకొరియా
  • కిమ్ జాంగ్ ఉన్ ను రెచ్చగొట్టారని ఆరోపించిన విదేశాంగ శాఖ
  • అణ్వాయుధాల అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని హెచ్చరిక

అమెరికా తీరుపై ఉత్తరకొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఉత్తరకొరియా విదేశాంగ శాఖ స్పందిస్తూ, ఉత్తరకొరియాను అమెరికా తీవ్రంగా రెచ్చగొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో ఉత్తరకొరియాను చేర్చడంపై అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆగ్రహం వ్యక్తం చేశారని వెల్లడించింది. అమెరికా చర్యను ఖండిస్తున్నామని తెలిపింది. అమెరికా నిరంకుశ పాలనకు ఈ చర్యే ఉదాహరణ అని స్పష్టం చేసింది.

 అమెరికా కావాలనుకుంటే ఉగ్రవాద దేశంగా పేర్కొనడం, వద్దనుకుంటే పేరు తొలగించడం సర్వసాధారణమని ఎద్దేవా చేసింది. ఉత్తరకొరియాను ఉగ్రవాద దేశంగా పేర్కొని అమెరికా పెద్ద తప్పుచేసిందని, ఇకపై అణ్వాయుధాల అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని కిమ్ హెచ్చరించారని వెల్లడించింది. ఇలాంటి ప్రకటనలతో ఉత్తరకొరియాను నిరోధించలేరని స్పష్టం చేసింది. భవిష్యత్ పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉత్తరకొరియా విదేశాంగ శాఖ తెలిపింది. 

  • Loading...

More Telugu News