actress kavita: సినీ పరిశ్రమ గురించి ఇంత నీచంగా మాట్లాడతారా?: బీజేపీ ఎంపీపై సినీ నటి కవిత ఫైర్

  • సినిమావాళ్ల భార్యలు రోజుకొకరితో వెళతారు అనే వ్యాఖ్యలపై మండిపాటు
  • మహిళల గురించి ఇంత దిగజారి మాట్లాడతారా?
  • లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడారు

సినిమావాళ్ల భార్యలు రోజుకొకరితో వెళ్తుంటారంటూ బీజేపీ ఉజ్జయిని ఎంపీ చింతయని మాలియా చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు కవిత తప్పుబట్టారు. సినీ రంగంలోని వారంటే ప్రతి ఒక్కరికి చులకన భావం ఉందని... అయితే, ఎవరికి బోర్ కొట్టినా సినిమానే కావాలని అన్నారు. ఒక ఎంపీగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి మహిళల గురించి ఇంద దిగజారి మాట్లాడటం దారుణమని అన్నారు. జాతీయ స్థాయి మీడియాలో కూడా ఈ విషయాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పారు.

ఇదే సమయంలో ఏపీ మంత్రి లోకేష్ పై కూడా కవిత మండిపడ్డారు. సినిమా వాళ్లకు ప్రాంతీయ భేదం ఉండదని అన్నారు. ఏపీలో ఆధార్ లేదు, ట్యాక్స్ లు ఇక్కడ కట్టడం లేదు అని చెప్పడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. అవగాహన లేకుండా లోకేష్ మాట్లాడారని అన్నారు. 

actress kavita
telangana maa
nandi awards
Nara Lokesh
  • Loading...

More Telugu News