gautami: మా అమ్మ పోయాకే నాకు జీవితమంటే ఏమిటో తెలిసింది: గౌతమి
- నాలుగు గోడల మధ్య పెరిగాను
- సినిమాల్లోకి వచ్చినా అమ్మ కూడా ఉండేది
- లోకం గురించి తెలియడానికి చాలా కాలం పట్టేసింది
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా ఒక వెలుగు వెలిగిన గౌతమి, వైవాహిక జీవితంలోను .. ఆరోగ్యపరంగాను ఎన్నో ఆటుపోట్లను చవిచూశారు. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టేంతవరకూ నేను నాలుగు గోడల మధ్య, అమ్మా .. నాన్న .. అన్నయ్య మధ్య పెరిగాను. అప్పటి వరకూ ఇల్లు తప్ప నాకు మరో ప్రపంచం తెలియదు" అని అన్నారు.
"ఆ వయసులో ఫ్రెండ్స్ తో ఆడుకోవాలని చెప్పేసి .. మా నాన్న దగ్గరుండి నా ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్లేవారు. సినిమాల్లో చేస్తున్నప్పుడు కూడా అమ్మ లేకుండా ఎక్కడికీ వెళ్లే దానిని కాను. అలాంటి నేను .. అమ్మపోయిన తరువాతనే నిజంగా ఎదగడం మొదలుపెట్టాను. అప్పుడే లైఫ్ అంటే ఏమిటో నాకు తెలిసింది. మనుషులు ఎలా వుంటారు? .. మనసులో ఏం పెట్టుకుని మాట్లాడుతున్నారు? .. ప్రపంచం ఎలా ఉంటుంది? అనే విషయాలను గ్రహించడం మొదలుపెట్టాను. అలా నా దారేదో తెలుసుకోవడానికి నాకు చాలా కాలం పట్టేసింది" అని చెప్పుకొచ్చారు.