america: పసిఫిక్‌ మహాసముద్రంలో కుప్పకూలిన అమెరికా నేవీ విమానం.. 11 మంది గ‌ల్లంతు!

  • జపాన్‌లోని ఒకినావా సమీపంలో ఘ‌ట‌న‌
  • ప్రమాదాన్ని ధ్రువీక‌రించిన‌ అమెరికా
  • గల్లంతైన‌ సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు

జపాన్‌లోని ఒకినావా సమీపంలో పసిఫిక్‌ మహాసముద్రంలో అమెరికా నేవీకి చెందిన ఓ విమానం కుప్పకూలిపోవ‌డం అల‌జ‌డి రేపుతోంది. ఆ విమానంలో 11 మంది నేవీ సిబ్బంది ఉన్న‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. ఈ ప్రమాదాన్ని అమెరికా నేవీ కూడా ధ్రువీకరించింది. ఈ విమాన‌ ప్ర‌మాదం గురించి తెలుసుకున్న యూఎస్‌ఎస్‌ రొనాల్డ్‌ రీగాన్‌ సిబ్బంది అక్క‌డ‌కు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

ఈ ప్ర‌మాదంలో గల్లంతైన‌ సిబ్బంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ప్ర‌మాదం జపాన్‌ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.45 గంటలకు జ‌రిగిన‌ట్లు అక్క‌డి అధికారులు ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల గురించి స‌మాచారం అందాల్సి ఉంది.  

  • Loading...

More Telugu News