Donald Trump: ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ను అమలు చేయవద్దు: కాలిఫోర్నియా కోర్టు

  • ట్రంప్ ట్రావెల్ బ్యాన్ పై మండిపడ్డ కాలిఫోర్నియా కోర్టు
  • ట్రావెల్ బ్యాన్ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్న న్యాయమూర్తి 
  • ఈ విషయంలో ట్రంప్ ఆదేశాలు అమలుచేయాల్సిన అవసరం లేదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కాలిఫోర్నియా కోర్టు షాక్ ఇచ్చింది. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధానం మూమ్మాటికి చట్టవిరుద్ధమేనని కాలిఫోర్నియా కోర్టు తేల్చిచెప్పింది. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ట్రంప్ ఉత్తర్వులు దేశాన్ని ముక్కలు చేసేలా ఉన్నాయని, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తాయని న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఈ ఉత్తర్వులను అమలు చేయాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. కాలిఫోర్నియా కోర్టుతో పాటు శాన్‌ ఫ్రాన్సిస్కో, శాంటా క్లారా కంట్రీ ప్రభుత్వాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. కాగా, వలసదారుల వల్లే అమెరికాలో సమస్యలని, ఉద్యోగాలు కూడా వారే తన్నుకుపోతున్నారని ట్రంప్ పలుమార్లు మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రావెల్ బ్యాన్ అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. 

Donald Trump
travel ban
california court
san francisco
santa clara
  • Loading...

More Telugu News