Pakistan: భారత్‌పై పాకిస్థాన్ తన తీరును మార్చుకోవాల్సిందే: తేల్చి చెప్పిన చైనా
- చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్‌పై భారత్ గూఢచర్యం: పాక్
- భారత్ మాపై కుట్రలు పన్నుతోంది
- ప్రతి విషయంలోనూ భారత్‌పై పాక్ నిందలు వేస్తోంది: చైనా
- ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎవరికీ మంచిదికాదు
చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్‌పై భారత్ గూఢచర్యం చేస్తోందని, పాక్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ జుబిర్ మహమ్మద్ హయత్ ఇటీవల ప్రకటించారు. అంతేగాక, సీపీఈసీ ప్రాజెక్టుపై కుట్రలు పన్నుతూ తమ వివాదాస్పద ప్రాంతాల్లో భారత్ హింసను సృష్టించాలని చూస్తోందని అన్నారు. ఇందుకోసం భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) ఒక జట్టును కూడా తయారు చేసిందని ఆధారాలు లేని ఆరోపణలు గుప్పించారు.
బలూచిస్థాన్‌లో భారత్ ఉగ్రవాదాన్ని పెంపొందిస్తోందని చెప్పారు. అయితే, పాక్ చేస్తోన్న ఈ అనవసర ఆరోపణలపై చైనా స్పందిస్తూ... ప్రతి విషయంలోనూ భారత్‌పై పాక్ నిందలు వేస్తోందని, పాక్ తన తీరును మార్చుకోవాలని తేల్చి చెప్పింది. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్‌పై భారత్ గూఢచర్యం చేస్తోందన్న వ్యాఖ్యలను చైనా కొట్టిపారేసింది. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎవరికీ మంచిది కాదని చైనా వ్యాఖ్యానించింది.