Posani Krishna Murali: తెలంగాణలో మీరు ట్యాక్స్ కట్టడం లేదా?: లోకేష్ పై పోసాని తీవ్ర వ్యాఖ్యలు

  • మీకు బుద్ధి, జ్ఞానం ఉందా?
  • విమర్శిస్తే నాన్ లోకల్ అంటారా?
  • గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా?

ఏపీ మంత్రి నారా లోకేష్ పై సినీనటుడు పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. "లోకేష్, మీకేమైనా బుద్ధి, జ్ఞానం ఉందా? చదువుకున్నారా?" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మీరు కూడా ట్యాక్స్ కడుతున్నారు కదా... ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు కదా? అంటూ ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని సూచించారు. మీలాంటి నేత ఉమ్మడి ఏపీలో ఉండి ఉంటే తాము నాశనం అయ్యేవారమని చెప్పారు. నంది అవార్డులను విమర్శించినంత మాత్రాన తమను నాన్ లోకల్ అంటారా? అంటూ మండిపడ్డారు.

గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా? అని ప్రశ్నించారు. తనకు ఈ అవార్డు వద్దని... ఒకవేళ తీసుకుంటే, 'కమ్మోడు కాబట్టి వీడికి అవార్డు ఇచ్చారు' అంటారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టుగానే ఐవీఆర్ఎస్ పద్ధతిలో విజేతలను ఎంపిక చేయాలని అన్నారు. 

Posani Krishna Murali
Nara Lokesh
nandi awards
  • Loading...

More Telugu News