Astronomy: ఏలియన్స్ కి సందేశం పంపిన ఖగోళ శాస్త్రవేత్తలు!

  • గత అక్టోబర్ లో ఏలియన్స్ కు రేడియో సందేశం
  • భూమికి 12 కాంతి సంవత్సరాల దూరంలో జీజే273గా పిలిచే నక్షత్రం
  • జీజే273బీ అనే గ్రహంపై నీరు ద్రవరూపంలో ఉంది, జీవం ఉండే అవకాశం ఉందంటున్న శాస్త్రవేత్తలు

ఏలియన్స్ కు ఖగోళ శాస్త్రవేత్తలు సందేశం పంపారు. నార్వేకు చెందిన యాంటెన్నా సాయంతో గత అక్టోబర్ లో ఈ రేడియో సందేశం పంపినట్టు ఖగోళ శాస్త్రవేత్త డగ్లస్ వాకోచ్ తెలిపారు. ఈ సందేశంలో గణితంలోని వివిధ అంశాలతో పాటు రేడియో తరంగాలకు సంబంధించిన సంకేతాలను కూడా పంపామని ఆయన అన్నారు. భూమికి 12 కాంతి సంవత్సరాల దూరంలో జీజే273గా పిలిచే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న రెండు గ్రహాలపై జీవం ఉండచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

 ఆ రెండింటిలో ఒకటైన జీజే273బీపై నీరు ద్రవరూపంలో ఉందని వారు తెలిపారు. అక్కడి పరిస్థితులు జీవులు మనుగడ సాగించే విధంగా ఉన్నాయని, అక్కడ కచ్చితంగా జీవులు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో అక్కడుండే జీవులే లక్ష్యంగా మెసేజింగ్‌ ఎక్స్‌ ట్రా టెరెస్ట్రియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎంఈటీఐ) నిపుణులు ఒక రేడియో సందేశాన్ని పంపారు. ఈ సందేశం వారికి చేరి, దానికి వారు సమాధానం ఇచ్చేందుకు 25 ఏళ్లు పట్టే అవకాశం ఉందని డగ్లస్‌ వాకోచ్‌ తెలిపారు. 

Astronomy
space
scientists
radio massage
  • Error fetching data: Network response was not ok

More Telugu News