పవన్ కల్యాణ్: ఎయిర్ పోర్ట్ వద్ద పవన్ కల్యాణ్ అభిమానుల సందడి.. ‘ సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు!
- లండన్ టూర్ ముగించుకుని వచ్చిన ‘జనసేన’ అధినేత
- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద ఘన స్వాగతం
- పవన్ ని చూసేందుకు వచ్చిన అభిమానులు
జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ లండన్ పర్యటన ముగించుకుని ఈరోజు హైదరాబాద్ కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కు స్వాగతం పలికేందుకు జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ‘జనసేన’ తెలంగాణ ఇన్ చార్జి ఎన్.శంకర్ గౌడ్, ‘జనసేన’ మీడియా హెడ్ హరిప్రసాద్ తదితరులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్దకు వెళ్లారు. పవన్ వస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా వారు చేసిన నినాదాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘సీఎం..సీఎం’ అంటూ నినాదాలు చేశారు. కాగా, లండన్ టూర్ గురించిన విశేషాలను హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ‘జనసేన’ ప్రతినిధులతో పవన్ పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను ‘జనసేన’ ట్విట్టర్ ఖాతాలో పొందుపరిచింది.