సీఎం చంద్రబాబు: ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ఇంకా ఫైనల్ కాలేదు: సీఎం చంద్రబాబు
- ప్రత్యేక ప్యాకేజ్ కింద ఎంత ఇస్తారో స్పష్టత రావాలి
- సమస్యలు చాలా ఉన్నాయి.. నిధులు చాలా అవసరం
- విభజన హామీల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు
- అసెంబ్లీలో చంద్రబాబు
ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ఇంకా ఫైనల్ కాలేదని, ఎంత ఇస్తారనే దానిపై స్పష్టత రావాలని అన్నారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఏ రాష్ట్రానికీ హోదా ఇవ్వడం లేదని, అందుకే, ప్యాకేజ్ కి ఒప్పుకున్నామని చెప్పారు. సమస్యలు చాలా ఉన్నాయని, నిధులు చాలా అవసరమని అన్నారు. విభజన హామీల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. విభజన హామీలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చిద్దామని చెప్పిన చంద్రబాబు, పోరాటం చేసే వాళ్లు ఢిల్లీ వెళ్లి చేయాలని ఇక్కడ కాదని, ఇలాంటి ఆందోళనలతో ప్రజల్లో అభద్రతాభావం వస్తుందని అన్నారు.