sai pallavi: ఆక‌ట్టుకుంటున్న 'క‌ణం' ట్రైల‌ర్‌... న‌ట‌న‌తో మ‌రోసారి మెప్పించేందుకు సిద్ధ‌మైన సాయి ప‌ల్ల‌వి

  • ఇదే సినిమాతో త‌మిళ సినిమాలో తెరంగేట్రం
  • హీరోగా నాగ‌శౌర్య‌
  • ఇప్ప‌టికే విడుద‌లైన ఎంసీఏ టీజ‌ర్‌

భానుమ‌తి పాత్ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచేసిన సాయి ప‌ల్ల‌వి, ఈసారి థ్రిల్లింగ్‌కి గురి చేసే లేడీ ఓరియెంటెడ్ హార‌ర్ సినిమాతో రాబోతోంది. క‌ణం పేరుతో రానున్న ఈ చిత్ర ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌లైంది. భ్రూణహ‌త్య క‌థాంశంగా తెర‌కెక్కిన ఈ చిత్ర ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. 'ఫిదా'లో తెలంగాణ యాస‌లో మాట్లాడిన సాయి ప‌ల్ల‌వి, ఈ చిత్రంలో కూడా తానే డ‌బ్బింగ్ చెప్పుకుంది. ఈ చిత్రంలో నాగ‌శౌర్య హీరోగా న‌టించాడు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించాడు.

ఈ చిత్రం ద్వారా త‌మిళంలో సాయి ప‌ల్ల‌వి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. అక్క‌డ ఈ సినిమా 'కరు' అనే పేరుతో విడుద‌లకాబోతుంది. ఈ రెండు భాష‌ల ట్రైల‌ర్ల‌ను న‌టుడు, ద‌ర్శ‌కుడు ప్ర‌భుదేవా విడుద‌ల చేశారు. సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్తుతం నాని స‌ర‌స‌న న‌టిస్తోన్న 'ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)' టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

sai pallavi
kanam
naga shourya
al vijay
abortion
  • Error fetching data: Network response was not ok

More Telugu News