పాలపిట్ట పార్క్: హైదరాబాదీలకు శుభవార్త.. పాలపిట్ట పార్కును ప్రారంభించిన కేటీఆర్!

  • కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్ లో పార్క్ ప్రారంభం
  • సైక్లింగ్ చేసేందుకు ఏర్పాట్లు
  • 30 ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దిన పార్క్

హైదరాబాద్ వాసులు సైక్లింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన పాలపిట్ట పార్క్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్క్ వద్ద కాలుష్య వాతావరణం లేకుండా జాగ్రత్తలు పాటించాలని, పార్క్ అభివృద్ధికి సహకరించిన అందరికీ తన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. కాగా, కొత్తగూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్ లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ పార్క్ ను ఏర్పాటు చేశారు. మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్ ను తీర్చిదిద్దారు. హరితహారంలో భాగంగా దాదాపు ఏడు వేల మొక్కలను ఇక్కడ నాటారు. ఈ పార్కు గురించి చెప్పాలంటే..

* రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో  అందుబాటులో  230 కొత్త సైకిళ్లు.
* సైక్లింగ్ కోసం వచ్చే వారు వీటిని వినియోగించుకోవచ్చు.
* పార్క్ లో విశాలమైన సైకిల్ స్టాండ్.
* రోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య సైక్లింగ్ కు
  అనుమతి.
* గంటపాటు సైక్లింగ్ చేస్తే పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.25 రుసుం కింద చెల్లించాలి.
* సొంత సైకిల్ తెచ్చుకునే వారైతే గంటకు రూ.25 చెల్లిస్తే చాలు.
* పాసులు తీసుకునే సౌకర్యమూ ఉంది. ప్రతినెలా పాసు తీసుకోవాలంటే రూ.800 చెల్లించాలి.

  • Loading...

More Telugu News