Aishwarya Rai: మ‌రోసారి దాతృత్వాన్ని చాటుకున్న ఐశ్వ‌ర్య రాయ్‌!

  • తండ్రి కృష్ణారాజ్ రాయ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పేద పిల్ల‌ల‌కు సాయం
  • గ్రహణం మొర్రి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వంద మందికి సర్జ‌రీ
  • తండ్రి బాట‌లోనే త‌న‌య‌

ఇటీవ‌ల త‌న పుట్టిన‌రోజుకి వెయ్యి మంది పేద విద్యార్థుల‌కు సంవ‌త్స‌రం పాటు ఉచిత భోజ‌న సౌక‌ర్యాన్ని న‌టి ఐశ్వ‌ర్య రాయ్ క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ ఇవాళ త‌న తండ్రి కృష్ణారాజ్ రాయ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మ‌రోసారి పేద పిల్ల‌ల‌కు సాయం చేసి త‌న దాతృత్వ హృద‌యాన్ని చాటుకున్నారు. గ్రహణం మొర్రి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న 100 మంది చిన్నారుల‌కు ఐశ్వ‌ర్య స‌ర్జ‌రీ చేయించ‌నున్నారు. ముంబైకి చెందిన స్మైల్ ట్రెయిన్ ఇండియా అనే స్వ‌చ్ఛంద సంస్థ స‌హ‌కారంతో ఆమె ఈ కార్య‌క్ర‌మానికి బాటలు వేయ‌నున్నారు.

కొన్ని నెల‌ల క్రితం కృష్ణారాజ్ అనారోగ్యంతో చ‌నిపోయారు. ఆయ‌న జీవించి ఉన్న‌పుడు ఇలాంటి ఎన్నో సేవ కార్య‌క్ర‌మాలు చేశారు. 2014లో ఆయ‌న  కూడా ఇలాగే గ్రహణం మొర్రి సమస్యలతో బాధపడుతున్న 100 మంది చిన్నారులకు సర్జరీ చేయించారు. ఐష్ కూడా అలాగే చేస్తూ తండ్రి పేరును నిలబెట్టింది. ఇవాళ ఆమె త‌ల్లి వృందా రాయ్‌, కుమార్తె ఆరాధ్యతో కలిసి ముంబయిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిని సందర్శించి, అక్కడి అనాథ పిల్లలతో వీరంతా కాసేపు గడపనున్నారు.

Aishwarya Rai
charity
surgery
mumbai
smile train india
aaradhya
  • Loading...

More Telugu News