: స్కార్పియో అమ్మకాలను తోసిరాజన్న డస్టర్
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీ విభాగంలో అగ్రస్థాయిలో అమ్మకాలు సాగిస్తున్న మహీంద్ర వారి స్కార్పియో ను రెనాల్ట్ డస్టర్ కేవలం ఒక్క ఏడాదిలోనే అధిగమించింది. రెనాల్ట్ డస్టర్ కేవలం 5 సీట్ల ఎస్యూవీ వాహనమే అయినప్పటికీ.. మోడల్ మార్కెట్ లోకి రంగప్రవేశం చేసిన ఏడాదిలోనే.. పూర్తిస్థాయిలో స్కార్పియోను అదిగమించడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్లో విక్రయాలు సాగిన గణాంకాలను తీసుకుంటే.. దేశంలో 4700 స్కార్పియోలు అమ్ముడవగా, దానికంటె చాలా భారీ స్థాయిలో 6300 డస్టర్ వాహనాలు అమ్ముడయ్యాయి.
స్కార్పియో కంటె.. సీట్ల సంఖ్య తక్కువ అయినప్పటికీ, ప్రారంభ మోడల్ నుంచి ధర విషయంలో కొద్దిగా ఎక్కువ అయినప్పటికీ డస్టర్ వాహనం అమ్మకాలు ముందంజలో ఉండడం విశేషం.