‘పద్మావతి’: ‘పద్మావతి’ విడుదల వాయిదా.. చట్టాన్ని గౌరవస్తామని ప్రకటన!

  • డిసెంబరు 1న విడుదల చేయడం లేదు
  • విడుదల తేదీని తిరిగి ప్రకటిస్తాం
  • వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, స్టూడియో ప్రకటన

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘పద్మావతి’ చిత్రాన్ని ఎన్నో వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర యూనిట్ తొలుత ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రం విడుదల తేదీనీ వాయిదా వేస్తున్నట్టు తాజాగా తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేయడం లేదని, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ ఈ మేరకు ప్రకటించింది.

చట్టం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) లను గౌరవిస్తున్నామని, సినిమా విడుదలకు కావాల్సిన అనుమతులు త్వరలోనే వస్తాయన్న నమ్మకం ఉందని పేర్కొంది. సినిమాను సెన్సార్ బోర్డు కన్నా ముందే వివిధ మీడియా ఛానల్స్ కు చూపించడాన్ని సీబీఎఫ్ సీ చీఫ్ ప్రసూన్ జోషి తీవ్రంగా వ్యతిరేకించారని, ఈ నేపథ్యంలో తమ దరఖాస్తు అసంపూర్ణంగా ఉందని సినిమాను సెన్సార్ చేయకుండా సీబీఎఫ్ సీ తిప్పి పంపిందని తెలిపింది. ‘పద్మావతి’ విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది.

  • Loading...

More Telugu News