రాహుల్: రెండో ఇన్నింగ్స్.. కేఎల్ రాహుల్, ధావన్ హాఫ్ సెంచరీలు!

  • కోల్ కతా తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో నిలకడగా  రాహుల్, ధావన్ భాగస్వామ్యం 
  •  టీమిండియా 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 116 పరుగులు
  •  ఓపెనర్ల హాఫ్ సెంచరీలతో అభిమానుల సంతోషం

కోల్ కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్,శిఖర్ ధావన్ భాగస్వామ్యం నిలకడగా కొనసాగుతోంది. శ్రీలంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నారు. రాహుల్, ధావన్ లు హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు.  ఇప్పటి వరకు 83 బంతులు ఆడిన రాహుల్ 60 పరుగులు, 78 బంతులు ఆడిన ధావన్ 55 పరుగులు పూర్తి చేశారు. 27 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 116 పరుగులు చేసింది. కాగా, ఓపెనర్లు రాహుల్, ధావన్ హాఫ్ సెంచరీలతో అభిమానుల్లో జోష్ పెంచారు.

  • Loading...

More Telugu News